కుమ్మరి పురుగు (ఆంగ్లం Carpenter bee) ఒక రకమైన ఈగ. ఇవి జైలొకోపినే (Xylocopinae) ఉపకుటుంబంలోని జైలొకోపా (Xylocopa) ప్రజాతికి చెందిన పెద్ద ఈగలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వీనిలో సుమారు 500 జాతులున్నవి.[1] వీటన్నింటి యొక్క ప్రధానమైన లక్షణము కలప, వెదురు మొదలైన వాటికి బొరియలు (burrows) చేసి అందులో గూడు కట్టుకొని నివసించడం.
మహా భారతంలో -విలువిద్య నేర్పిన గురువే కర్ణుడిని శపించడానికి కారణమైంది ఇదే. కుమ్మరి పురుగు రూపంలో వచ్చిన ఇంద్రుడు, కర్ణుడి తొడను తొలుస్తాడు. గురువే కర్ణుడిని శపించే పరిస్థితి కల్పిస్తాడు. మహాభారతంలోని ఓ ఘట్టంలోనే దీనికి ఒకింత చోటు దొరికింది. కానీ, ఇంత పెద్ద భూమండలం మీద చోటులేక ఇది అంతరించిపోతోందట. కొనేళ్ల క్రితం వరకూ కనిపించిన కుమ్మరి పురుగు -క్రమంగా అంతరించిపోయింది. మట్టిలో బతికే ఈ పురుగులు -పంటలకు వాడుతున్న క్రిమి సంహారక మందుల కారణంగానే అంతరించాయని అంటున్నారు శాస్తవ్రేత్తలు. మనిషికి మేలు చేయడమే తప్ప, కీడు చేయడం ఎరుగని కుమ్మరి పురుగులను మళ్లీ వృద్ధి చేయడానికి ఈశాన్య జర్మనీలోని ఫ్యూయర్‌స్టీన్‌వాల్డే గార్డెన్ జాగ్రత్తలు తీసుకుంటోందట. ఇందుకోసం క్రిమినాశన మందుల్ని వాడటాన్ని కూడా నిషేధించార్ట.
Carpenter bee (X. tabaniformis)
on Salvia
European carpenter bee (X. violacea) on a Lantana camara flower
in Kona
Carpenter Bee is working the wood in Kona
కుమ్మరి పురుగు (ఆంగ్లం Carpenter bee) ఒక రకమైన ఈగ. ఇవి జైలొకోపినే (Xylocopinae) ఉపకుటుంబంలోని జైలొకోపా (Xylocopa) ప్రజాతికి చెందిన పెద్ద ఈగలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వీనిలో సుమారు 500 జాతులున్నవి. వీటన్నింటి యొక్క ప్రధానమైన లక్షణము కలప, వెదురు మొదలైన వాటికి బొరియలు (burrows) చేసి అందులో గూడు కట్టుకొని నివసించడం.