dcsimg

కాక్టేసి ( Telugu )

provided by wikipedia emerging languages

కాక్టేసి (plural: cacti) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము. వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి అమెరికా ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచితే, కొన్ని పంటలుగా పండిస్తున్నారు.

కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని కాండాలు రసభరితంగా మారి, పత్రహరితం కలిగివుంటాయి. ఆకులు ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.

కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన Pachycereus pringlei అత్యధికంగా 19.2 మీటర్లుంటే, [1] అతి చిన్నవి Blossfeldia liliputiana సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది.[2] కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని పువ్వులు పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. పరాగసంపర్కం నిశాచరులైన కీటకాలు, చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.

ఉపయోగాలు

  • ప్రపంచ వ్యాప్తంగా కాక్టై పూలకుండీలలో పెంచబడి, ఇంట్లో అలంకరణ కోసం ఉంచుతారు. ఇవి ఎక్కువగా ఎడారి మొక్కలుగా బీడు భూములు, కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే దేశాలు, ప్రాంతాలలో ఇవి జీవించగలవు.
  • కాక్టై సాధారణంగా పంటపొలాల చుట్టు కంచెగా పెంచుతారు. ప్రకృతి వనరులు లేని ప్రాంతాలలో ఎక్కువ ఖర్చుతో కూడిన కంచెలు కట్టించుకోలేనివారు పొలాల చుట్టూ వీటిని పెంచుతారు. ఈ విధమైన కాక్టస్ కంచెను కొన్ని పల్లెలలో ఇండ్ల చుట్టూ కూడా పెంచుతారు. వీటికుండే మొనదేలిన ముల్లు దొంగలు,, పశువుల నుండి రక్షణ కల్పిస్తాయి.
  • కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత కలిగివున్నాయి. కొన్ని ముఖ్యంగా నాగజెముడు కండ కలిగిన పండ్లు కాస్తాయి. పిటాయ జాతి మొక్కలు డ్రాగన్ కాయలను ఇస్తాయి. వీటిని తినవచ్చును.
  • కొన్ని కాక్టస్ మొక్కలు Peyote లేదా Lophophora williamsii, Echinopsis మొదలైన వాటిని అమెరికా ఖండాలలో కొన్ని మానసిక రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Salak, M. (2000). In search of the tallest cactus. Cactus and Succulent Journal 72 (3).
  2. Mauseth Cactus research: Blossfeldia liliputiana

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

కాక్టేసి: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

కాక్టేసి (plural: cacti) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము. వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి అమెరికా ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచితే, కొన్ని పంటలుగా పండిస్తున్నారు.

కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని కాండాలు రసభరితంగా మారి, పత్రహరితం కలిగివుంటాయి. ఆకులు ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.

కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన Pachycereus pringlei అత్యధికంగా 19.2 మీటర్లుంటే, అతి చిన్నవి Blossfeldia liliputiana సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది. కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని పువ్వులు పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. పరాగసంపర్కం నిశాచరులైన కీటకాలు, చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు