చిత్రమూలము ప్లంబగో ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. ఇది ప్లంబజినేసి కుటుంబానికి చెందినది. ఈ పేరు లాటిన్ పదం ప్లంబమ్ అంటే సీసం నుండి వచ్చినది. కొన్ని జాతులలో సీసపు నీలం రంగుల పూల మూలంగా ఇది వచ్చినది. రసాయనంగా ఈ మొక్కల వేళ్ళలో 'ప్లంబజీన్' (Plumbagein) అనే పదార్థం ఉంటుంది. వీని నుండి చిత్రకాదివటి, చిత్రఘృతం మొదలైన ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. కొన్ని మొక్కలను ఉద్యానవనాల్లో అలంకరణ కోసం కూడా పెంచుతారు. వేర్లు జీర్ణ శక్తిని పెంచే గుణం, గడ్డలను హరించే గుణం కలిగివుంటాయి.