dcsimg
Unresolved name

Dendrobranchiata

రొయ్య ( Telugu )

provided by wikipedia emerging languages

రొయ్యలు (ఆంగ్లం Prawn and Shrimp) ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన క్రస్టేషియా (Crustaceans) [1] విభాగానికి చెందిన జీవులు.[2]. ప్రాన్, ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata dendro=“tree”; branchia=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు.రొయ్యలు దేహపరిమాణంలో ష్రింప్స్(shrimps) కన్న పెద్దవిగా ఉండి, పొడవాటి కాళ్ళు వుండి, మూడుజతల కాళ్ళమీద గోళ్ళు(claws) ఉండును.ష్రింప్స్‌ అనేవి రొయ్యలకన్న తక్కువ శరీర పరిమాణం కలిగి, రెండుజతలకాళ్ళమీద మాత్రమే గోళ్ళు ఉండును[3]. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata) లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.

ఉపయోగాలు

రొయ్యల పరిశ్రమ, పెంపకంలో ప్రాన్, ష్రింప్ రెండింటికీ కలిపి ఉపయోగిస్తారు. యూరప్, ఇంగ్లాండు దేశాలలో ఎక్కువగా ప్రాన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే అమెరికాలో ష్రింప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అంటే కిలోగ్రాముకు 15 కంటే తక్కువ తూగితే వాటిని ప్రాన్ అని భావిస్తారు. ఆస్ట్రేలియా మరియ్ ఇతర అలీన దేశాలలో ప్రాన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో ప్రాన్ కూర (prawn curry) చాలా ప్రసిద్ధిచెందినది.

ఉత్పత్తి

వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: Leander serratus. అమెరికాలో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో, ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.

రొయ్య ప్రసరణ వ్యవస్థ

రొయ్య యందు వివృత(open) రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. రొయ్య ప్రసరణ వ్యవస్థలో రక్తము, హృదయము, ధమనులు, రక్తకోటరములు లేక లిక్విణులు అను భాగములుండును. సిరలు ఉండవు.[4]

రొయ్య జీర్ణ వ్యవస్థ

రొయ్య జీర్ణ వ్యవస్థ యందు జీర్ణ నాళము, దానికి సంబంధించిన గ్రంథులు ఉండును[5]].

జీర్ణ నాళము

దీని యందు మూడు భాగము లుండును.అవి

  • పూర్వాహారనాళము లేక ఆద్యముఖము,
  • మధ్యాహారనాళము,
  • అంత్యాహారనాళము లేక పాయుపధము

పూర్వా, అంత్యాహారనాళములు లోపలి తలములో అవభాసిని లేక ఇంటైమాతో ఏర్పడి యుండును. మధ్యాహారనాళము అంతస్త్వచముచే ఆవరింపబడి యుండును.

పూర్వాహారనాళము లేక ఆద్యముఖము

ఆద్యముఖము యందు నోరు, ఆస్యకుహరము, ఆహారవాహిక, జీర్ణశయ భాగములుండున.

  • నోరు
  • ఆస్యకుహరము
  • ఆహారవాహిక
  • జీర్ణశయ

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "prawn". oxforddictionaries.com. http://www.oxforddictionaries.com/definition/english/prawn. Retrieved 04-03-2015.
  2. Burkenroad, M. D. (1963). "The evolution of the Eucarida (Crustacea, Eumalacostraca), in relation to the fossil record". Tulane Studies in Geology. 2 (1): 1–17. Unknown parameter |quotes= ignored (help)
  3. "Prawn vs. Shrimp". diffen.com. http://www.diffen.com/difference/Prawn_vs_Shrimp. Retrieved 04-03-2015.
  4. palaemon-prawn-blood-vascular-system
  5. [http://www.biozoomer.com/2014/11/palaemon-prawn-digestive-system.html palaemon-prawn-digestive-system
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

రొయ్య: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

రొయ్యలు (ఆంగ్లం Prawn and Shrimp) ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన క్రస్టేషియా (Crustaceans) విభాగానికి చెందిన జీవులు.. ప్రాన్, ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata dendro=“tree”; branchia=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు.రొయ్యలు దేహపరిమాణంలో ష్రింప్స్(shrimps) కన్న పెద్దవిగా ఉండి, పొడవాటి కాళ్ళు వుండి, మూడుజతల కాళ్ళమీద గోళ్ళు(claws) ఉండును.ష్రింప్స్‌ అనేవి రొయ్యలకన్న తక్కువ శరీర పరిమాణం కలిగి, రెండుజతలకాళ్ళమీద మాత్రమే గోళ్ళు ఉండును. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata) లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు