అంబెల్లిఫెరె కుటుంబంలో దాదాపు 300 ప్రజాతులు, 3000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్నప్పటికి, సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తారముగా ఉన్నాయి. భారతదేశంలో 53 ప్రజాతులు, 200 జాతులను గుర్తించారు.
కుటుంబ లక్షణాలు
- ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
- కాండము బోలుగా ఉంటుంది.
- మొక్క భాగాలలో షైజోజనస్ తైల గ్రంథులు ఉంటాయి.
- ఏకాంతర, సంయుక్త పత్రాలు, పుచ్ఛ రహితము.
- తొడుగు వంటి పత్రపీఠము.
- పుష్ప విన్యాసము సరళ లేదా సంయుక్త గుచ్ఛము.
- ద్విలింగ పుష్పాలు, పంచభాగయుతము, అండకోశోపరికము, సౌష్టవయుతము.
- మకరందమును ఉత్పత్తిచేసే స్టైలోపోడియం.
- ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత నిమ్న అండాశయము.
- లోలాకార అండాలు, స్తంభ అండాన్యాసము.
- ఫలము క్రీమోకార్ప్.
ఆర్ధిక ప్రాముఖ్యత
- కారట్ వేరు దుంపలను కూరగాయలుగా వాడతారు.
- ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను సుగంధ ద్రవ్యాలుగా వాడతారు.
- కోరియాండ్రమ్ మొక్కలను కొత్తిమిరగా వాడతారు.
- ఫెరులా ఎసఫీటిడ కాండం, వేరు నుండి లభించే రెసిన్ ను ఇంగువగా వాడతారు. దీనిని వంటలలోను, అజీర్తికి, దగ్గుకు మందుగా వాడతారు.
- బ్రాహ్మి పత్రాలు జ్ఞాపకశక్తిని వృద్ధిపరచడానికి, చలువచేయడానికి ఉపయోగపడతాయి.
- కొన్ని జాతులను అందం కొరకు తోటలలో పెంచుతారు.
ముఖ్యమైన ప్రజాతులు, మొక్కలు
మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.