dcsimg

గురివింద ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
గజిబిజిగావున్న చెట్ల మధ్య అల్లుకున్న గురివింద చెట్టు
 src=
Abrus precatorius

గురివింద (ఆంగ్లం Jequirity, Indian Licorice) ఒక చిన్న ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'ఏబ్రస్ ప్రికటోరియస్ (Abrus precatorius) '; ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇవి చాలా విషపూరితమైనవి.

లక్షణాలు

  • ఇది తీగల ద్వారా ఎగబ్రాకే పొద.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న సన్నని పత్రకాలు గల ( చింతాకుల వలె) సమపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • గ్రీవస్థ అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న కెంపు రంగు పుష్పాలు.
  • నల్లని మచ్చతో చిక్కని ఎరుపురంగు విత్తనాలు కలిగి ఉన్న ద్విదారక ఫలాలు.

ఉపయోగాలు

  • గురివింద విత్తనాలను కంసాలి బంగారాన్ని తూకం కోసం వినియోగిస్తారు. (గత కాలంలో బంగారాన్ని ఇన్ని గురుగింజల ఎత్తు అని అనే వారు)

గురువింద ఆకులను నోట్లో వేసుకొని కొంత నమిలి ఆ తర్వాత ఒక చిన్న రాయిని కూడా నోట్లో వేసుకొని నమిలితె అది అతి సునాయాసంగా నలిగి పిండి అయి పోతుంది. అలాగే గింజలను కనురెప్పల కింద దాచి పెట్టడం, పల్లెల్లోని పిల్లలకు ఇదొక ఆట. ఇందులోని మర్మం / రసాయన చర్య ఏమిటొ తెలిసిన వారు చెపితే?. దీని అకులు విష పూరితం కాదు. గింజ లోని పప్పును కొన్ని వైద్యాలకు ఉపయోగిస్తారు.

గ్యాలరీ

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

గురివింద: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages
 src= గజిబిజిగావున్న చెట్ల మధ్య అల్లుకున్న గురివింద చెట్టు  src= Abrus precatorius

గురివింద (ఆంగ్లం Jequirity, Indian Licorice) ఒక చిన్న ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'ఏబ్రస్ ప్రికటోరియస్ (Abrus precatorius) '; ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇవి చాలా విషపూరితమైనవి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు