జంతువులు (లాటిన్: Animalia, స్పానిష్: Animales, ఆంగ్లం: Animals, పోర్చుగీస్: Animais, జర్మన్: Tiere) ఈ సృష్టిలో పరిణామక్రమంలో అన్నింటికన్నా ఉన్నతస్థాయిలో ఉన్న జీవులు.
ఏనిమేలియా రాజ్యాన్ని కణజాలాల అభివృద్ధిని బట్టి రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు.
అరిస్టాటిల్ జీవ ప్రపంచాన్ని జంతువులు, మొక్కలుగా వర్గీకరించాడు. ఆ తరువాత కరోలస్ లిన్నేయస్ తొలసారిగా ఒక క్రమానుసారంగా జీవులను వర్గీకరించాడు. అప్పటినుండి జీవశాస్త్రజ్ఞులు వర్గీకరణలో జీవపరిణామ సంబంధాలకు పెద్దపీట వెయ్యటం వలన ఈ వర్గాల యొక్క విస్తృతి కొంత కుదింపుకు గురైనది. ఉదాహరణకు, సూక్ష ప్రోటోజోవాలు చర జీవులు కాబట్టి, ఇదివరకు వాటిని జంతువులుగా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు వాటిని ప్రత్యేక వర్గముగా భావిస్తున్నారు.
కరోలస్ లిన్నయస్ యొక్క తొలి ప్రతిపాదనలోని మూడు సామ్రాజ్యాలలో జంతు సామ్రాజ్యము ఒకటి. జంతువులను ఆయన వెర్మిస్, ఇన్సెక్టా, పిసెస్, ఆంఫీబియా, ఏవ్స్, మమ్మేలియా తరగతులుగా విభజించాడు. ఆ తరువాతి కాలంలో చివరి నాలుగింటినీ, కార్డేటా అనే ఒకే ఫైలం కింద ఉంచి ఇతర జంతుజాలాన్ని ప్రత్యేకంగా ఉంచారు. ఒక మూలం నుండి ఇంకో మూలానికి చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ, పైన ఇచ్చిన జాబితా జంతువుల వర్గీకరణపై మన ప్రస్తుత అవగాహనను స్థూలంగా ప్రతిబింబిస్తున్నది.
కొన్ని జంతువులు గాలిలోకి ఎగిరే శక్తిని కలిగివుంటాయి. వీటిని ఎగిరే జంతువులు అంటారు. వీటిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు మొదలైనవి ముఖ్యమైనవి. అరుదుగా కొన్ని రకాల చేపలు, క్షీరదాలు కూడా పరిణామ క్రమంలో ఈ లక్షణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి.
జంతువులు (లాటిన్: Animalia, స్పానిష్: Animales, ఆంగ్లం: Animals, పోర్చుగీస్: Animais, జర్మన్: Tiere) ఈ సృష్టిలో పరిణామక్రమంలో అన్నింటికన్నా ఉన్నతస్థాయిలో ఉన్న జీవులు.