జోరీగ (ఆంగ్లం Horse-fly) ఒక రకమైన ఈగలు. ఇవి డిప్టెరా (Diptera) క్రమంలో టాబనిడే (Tabanidae) కుటుంబానికి చెందిన కీటకాలు. వీటిని సామాన్యంగా గుర్రపు ఈగలు, అడవి ఈగలు లేదా లేడి ఈగలు అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద ఈగలు. వీటిని చాలామంది చీడపురుగులు (Pests) గా భావిస్తారు. ఇవి చేసే విపరీతమైన శబ్దానికి కాబోలు "చెవిలో జోరీగ" అనే నానుడి వచ్చింది. ఇవి ముఖ్యమైన పోలినేటర్లు (Pollinators). జోరీగలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఆస్ట్రేలియాలో వీటిని మార్చి ఈగలు అని పిలుస్తారు.
జోరీగలలో సుమారు 3,000 జాతులున్నాయి. ఇవి మూడు ఉపకుటుంబాలకు చెందినవి: